కేంద్ర వ్యవసాయ బిల్లులు, జీఓ నెంబర్ 22ను తక్షణమే రద్దు చేయాలని అనంతపురం జిల్లా కదిరి ఆర్డీఓ ఎదుట వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు రక్షణగా ఉన్న చట్టాలను కాలరాస్తోందని నేతలు మండిపడ్డారు.
వారి ప్రయోజనాల కోసం..
కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వ్యవసాయ బిల్లులను, నిత్యావసర సరుకుల చట్ట సవరణ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే విధానాన్ని తీసుకొచ్చి.. అన్నదాతలకు ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌కు ఎసరు పెట్టడానికి యత్నిస్తోందని ఆరోపంచారు. తక్షణమే ప్రభుత్వాలు ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చూడండి:
'వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది'