అనంతపురం జిల్లా ఉరవకొండ చర్చి సర్కిల్లో ఉన్న ఓ నగల దుకాణంలో దొంగలు పడ్డారు. బంగారం, వెండి సామగ్రిని తీసుకెళ్లారు. దుకాణం తాళాలు పగల గొట్టిన దొంగలు... సీసీ కెమెరాలు తొలగించారు. అనంతరం చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు దుకాణం యజమాని హాసీమ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. క్లూస్ టీం... దుకాణంలో వివరాలను సేకరించి దుండగుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది.
నగల దుకాణంలో దొంగలు పడ్డారు
అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఓ నగల దుకాణంలో దొంగలు పడ్డారు. సీసీ కెమెరాలు తొలగించి బంగారం, వెండి సామగ్రిని తీసుకెళ్లారు.
నగల దుకాణంలో దొంగలు పడ్డారు