అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని 24 గంటల వ్యవధిలో నలుగురు కొవిడ్ బాధితులు మృతి చెందారు. ఆస్పత్రి కరోనా వార్డులో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితులకు ఆక్సిజన్ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ... వెంటిలేటర్ సేవలు అందుబాటులో లేక ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఆస్పత్రిలో ఇంకో తొమ్మిది మంది బాధితుల పరిస్థితి విషమంగా మారిందని... మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం ఆస్పత్రులకు తరలించాలని వైద్యాధికారులు సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడే వెంటిలేటర్లను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.