సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా సీబీఐ దర్యాప్తు చేయించాలని హిందూపురం పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బి.కె పార్థసారథి డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలలు కక్షలతోనే గడిచాయని విమర్శించారు.
'సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలి'
సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి డిమాండ్ చేశారు.
దళితులు, మైనారిటీలు, రైతులపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామని రాష్ట్ర హోంమంత్రి పేర్కొన్నారని...కానీ 12 గంటలు గడవకముందే దోషులు బెయిల్పై బయటకు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అమరావతిలో రైతులపై కేసులు నమోదైతే 15 రోజులు గడిచినా బెయిల్ మంజూరు చేయని ప్రభుత్వం... ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారికి వెంటనే బెయిల్ మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం, పోలీసులపైన నమ్మకం లేదని సలాం కుటుంబానికి జరిగిన అన్యాయానికి సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు.
ఇదీ చదవండి:
'సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి'
TAGGED:
సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన