పంచ కట్టుతో తలకు పాగా చుట్టుకుని బ్యాట్‌తో బంతిని కొడుతున్న ఎవరీ పెద్దాయన అనుకుంటున్నారా... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవులు చేపట్టి... ఆయన మరణానంతరం ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి.. ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ రైతుగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఆయన స్వగ్రామం నీలకంఠాపురంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రఘువీరా పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు క్రీడాకారులతో కరచాలనం చేసి.. బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
క్రికెట్ బ్యాట్ పట్టిన ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి..! - Raghuveer Reddy Latest News
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురంలో ఆసక్తికర సంఘటన జరిగింది. మాజీమంత్రి, ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి.. క్రికెట్ బ్యాట్ పట్టి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం... తన స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు.
క్రికెట్ బ్యాట్ పట్టిన ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి..!