అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం సిద్దరాంపురంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి తండ్రీకొడుకులు మరణించారు. గ్రామానికి చెందిన మహమ్మద్ జిలాన్ వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలానికి వెళ్లారు. అక్కడ నీటి కోసం ఏర్పాటు చేసి గుంటలో.. జిలాన్ 8 ఏళ్ల కుమారుడు పడిపోవడంతో అతణ్ణి రక్షించే క్రమంలో తండ్రి కూడా ప్రాణాలు విడిచారు. తోటి కూలీలు గమనించి వారిని కాపాడే ప్రయత్నం చేసినా... ఫలితం లేకపోయింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు మృత్యువాత పడటంతో నిరుపేద కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నీటిగుంటలో పడి.. తండ్రీకొడుకులు మృతి
ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం సిద్దరాంపురంలో చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద నీటిగుంటలో పడి ఇద్దరూ తనువు చాలించారు.
నీటిగుంటలో పడి తండ్రి,కొడుకు మృతి