ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers Problems: అన్నదాతకు భరోసా ఇవ్వని పంటల బీమా.. ఆవేదనలో రైతన్న - YCP government given assurances to farmers

Farmers Crop Insurance Policy: పంటకు నష్టపరిహారం లెక్కింపు విధానంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట నష్టాన్ని దిగుబడి ఆధారంగా లెక్కింపుతో కొంత మేలు జరుగుతున్నా.. వాతావరణ ఆధారిత బీమాతో అన్నదాతలకు ప్రయోజనం సన్నగిల్లుతోంది. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 950 కోట్ల రూపాయల పరిహారం రాగా.. ప్రస్తుతం అది 370 కోట్లకు మించటం లేదు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లిస్తామని చెబుతుండటంతో.. పరిహారంపై కంపెనీలని ప్రశ్నించే హక్కునూ అన్నదాతలు కోల్పోతున్నారు.

Farmers Crop Insurance Policy
అన్నదాతకు భరోసా ఇవ్వని పంటల బీమా విధానం.. ఆవేదనలో రైతన్న

By

Published : Jul 8, 2023, 8:36 AM IST

Updated : Jul 8, 2023, 10:42 AM IST

అన్నదాతకు భరోసా ఇవ్వని పంటల బీమా.. ఆవేదనలో రైతన్న

Farmers Crop Insurance Policy: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా విధానం అన్నదాతలకు భరోసా ఇవ్వలేకపోతోంది. వాతావరణ కారణంగా పంట నష్టపోయినపుడు గ్రామాన్ని యూనిట్‌గా.. దిగుబడి ఆధారంగా పరిహారం ఇచ్చే విధానం రైతులకు ఉపయుక్తంగా ఉండేది. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పంటలను వాతావరణ ఆధారంగానూ.. మరికొన్నిదిగుబడి ఆధారంగా నష్టాన్ని లెక్కిస్తున్నారు. అలానే గ్రామం యూనిట్‌గా కొన్ని పంటలు, మండలం యూనిట్‌గా మరికొన్ని లెక్కించే నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు పరిహారం దక్కక పోవటంతో అనేక మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడికి తగినట్లగా పరిహారం ఇచ్చేవారని ప్రస్తుతం అది వందల్లోనే ఇస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు.

గతంలో పంటల బీమా ప్రీమియంను కంపెనీలకు ప్రభుత్వాలు మూడు భాగాలుగా చెల్లించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రీమియం రాయితీ మినహాయించి, రైతుల వాటాగా ఐదు శాతం వసూలు చేసేవారు. పంట రుణం తీసుకునే సమయంలోనో, రుణం రెన్యూవల్ చేసుకునేటప్పుడో బ్యాంకులు.. రైతుల వాటా ప్రీమియంను వసూలు చేసేవి. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుల వాటా ప్రీమియం కూడా తామే చెల్లిస్తామని చెప్పారు. ఇది రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ, పరిహారం అందని సందర్భంలో రైతులు కోర్టును ఆశ్రయించే హక్కు కోల్పోతున్నారని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం జాబితా విడుదల చేసింది.

పంటను పూర్తిగా నష్టపోయిన వేలాది మంది రైతుల పేర్లు జాబితాలో లేకపోవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. 2022లో పంట నష్టానికి పరిహారం రైతుల ఖాతాలకు జమచేయటానికి నేడు సీఎం జగన్ కల్యాణదుర్గంలో బటన్‌ నొక్కనున్నారు. వేరుసెనగ పంట నష్టపోయిన రైతుల్లో చాలా మందికి పరిహారమే రావటంలేదు. మరికొందరు రైతులు సాగుచేసిన విస్తీర్ణంలో సగం కూడా నష్టం అంచనాకు తీసుకోలేదు. దీనివల్ల అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. ఏటా పంట నష్టం పరిహారం జాబితా జిల్లా కేంద్రానికి వస్తే వ్యవసాయశాఖ అధికారులు లోటు పాట్లు గుర్తించి రైతులకు ఇబ్బంది లేకుండా చేసేవారు.

ఈ సారి నేరుగా రైతు భరోసా కేంద్రాలకే జాబితాలు వెళ్లటంతో.. ఏ గ్రామానికి, మండలానికి ఎంత పరిహారం వచ్చిందనే సమగ్ర సమాచారం జిల్లా అధికారుల దగ్గర ఉండట్లేదు. ఏటా పంట నష్టం పరిహారం జాబితా జిల్లా కేంద్రానికి వస్తే వ్యవసాయశాఖ అధికారులు లోటుపాట్లు గుర్తించి రైతులకు ఇబ్బంది లేకుండా చేసేవారు. ఈసారి నేరుగా రైతు భరోసా కేంద్రాలకే జాబితాలు వెళ్లటంతో ఏ గ్రామానికి, మండలానికి ఎంత పరిహారం వచ్చిందనే సమగ్ర సమాచారం జిల్లా అధికారుల వద్ద కొరవడింది.

Last Updated : Jul 8, 2023, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details