వాతావరణ బీమా వర్తింపు విషయములో రైతులందరికీ న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని అన్నదాత గ్రామ సచివాలయానికి తాళం వేసి బైఠాయించారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం ఈతోడు పంచాయితీలో ఈ ఘటన జరిగింది. 90 శాతం మంది రైతులకు వాతావరణ బీమా వర్తించడం లేదని.. రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం పంటలు పూర్తిగా కోల్పోయిన బీమా వర్తింపజేయక పోవడాన్ని అన్నదాతలు తప్పుపట్టారు.
గ్రామ సచివాలయానికి తాళం వేసిన రైతులు
వాతవరణ బీమా వర్తింపులో రైతులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ గ్రామ సచివాలయానికి తాళం వేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అందుకు గల కారణాలను తెలియజేయాలని రైతులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారి రైతులతో మాట్లడి.. అందరికీ న్యాయం జరిగేల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తమ పంచాయతీకి వాతావరణ బీమా వర్తించక పోవడానికి కారణాలను తెలియజేయాలని రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ఆందోళన తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారి శ్రీ హరి నాయక్ గ్రామానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఎక్కువ మంది రైతులకు వాతావరణ బీమా రాకపోవడానికి గల కారణాలను పరిశీలిస్తామని, బ్యాంకుల్లోనూ బీమాకు సంబంధించిన సమాచారాన్ని సమీక్షించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.
ఇదీ చదవండి : రైతులందరికీ పంట బీమా పరిహారం అందించాలి'