మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా కార్యకర్తల విస్తృత ప్రచారం కన్నా ఎక్కువగా ఓటర్లను వాలంటీర్లు ప్రలోభా పెడుతున్నారని అనంతపురం జిల్లా సీపీఎం కార్యదర్శి రాంభూపాల్ ఆరోపించారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా తన అధికారాన్ని వినియోగించుకుంటోదన్నారు. వాలంటీర్లను ఎన్నికల సంఘం తమ విధులకు పరిమితులు విధించినా.. ఏ చట్టాలు వారు ముందు పని చేయడం లేదన్నారు. పలు చోట్ల ఇప్పటికి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరును చూస్తుంటే పోలింగ్ రోజు కూడా ఏం జరుగుతుందోనని అనుమానంగా ఉందన్నారు. బుధవారం జరగబోయే పోలింగ్‌ను ప్రశాంతంగా జరిపించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
'ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటేయండి..' - Municipal elections updates
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా జరిపించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ కోరారు. ఎన్నికల్లో వైకాపా విస్తృత ప్రచారం కన్నా ఓటర్లను వాలంటీర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా సీపీఎం కార్యదర్శి రాంభూపాల్