ఏసీబీ అధికారినంటూ పలువురు ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేస్తూ...పోలీసులకు చిక్కాడు అనంతపురం జిల్లా కొట్టాలపల్లికి చెందిన జయకృష్ణ జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపిన వివరాలు ప్రకారం ...ప్రభుత్వ అధికారులకు ఫోన్లు చేసి తాను ఏసీబీ అధికారిని అని..వాళ్లు చేసిన చేసిన అక్రమాలుా తన వద్ద ఉన్నాయంటూ జయకృష్ణ బెదిరించేవాడు... కేసు ఉండకూడదంటే మీరు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఇలా 16మంది అధికారుల నుంచి 27లక్షల వరకు వసూలు చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు జయకృష్ణను చాకచక్యంగా పట్టుకున్నారు. ఇతని నుంచి రెండు లక్షల 91వేల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.గ్యాంగ్ అనే సినిమా చూసే జయకృష్ణ ఏసీబీ అధికారి అవతారమెత్తినట్లు ఎస్పీ చెప్పారు. ఇంతకుముందు కూడా జయకృష్ణ చైన్‌స్నాచింగ్ చేసి జైలుశిక్ష అనుభవించినట్లు ఎస్పీ తెలిపారు.
గ్యాంగ్ సినిమా చూశాడు..లక్షలసొత్తు కాజేశాడు..!
'గ్యాంగ్'సినిమా చూశారా..!? అందులో హీరో సూర్య లంచం ఇవ్వలేక ఏసీబీ అధికారి కాలేకపోతాడు...దీంతో తనే స్నేహితులతో ఒక గ్యాంగ్‌గా ఏర్పడి.. డబ్బున్న వాళ్లని, లంచగొండి అధికారులను.. ఏసీబీ పేరుతో దోచుకుంటాడు. సరిగ్గా అలాంటి పనే చేశాడు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలానికి చెందిన జయకృష్ణ..! తాను ఏసీబీ అధికారినంటూ.. ప్రభుత్వ ఉద్యోగుల నుండి దోచుకున్నాడు.. కాకపోతే.. ఈ సినిమాలో క్లైమాక్స్ మారింది.
వివరాలు తెలుపుతున్న అనంతపురం ఎస్పీ