ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Aadhar Mistake: అధికారుల నిర్వాకం.. తలకిందులైన యువకుడి జీవితం

ఆ విద్యార్థి బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరించారు అధికారులు. కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారని చరవాణికి మెసేజ్ రూపంలో సందేశం పంపారు. ఈ ఘటనతో అవాక్కైన ఆ విద్యార్థి చదువుకు దూరం అయ్యాడు..ప్రభుత్వ పథకాలూ అందక ఆవేదన చెందుతున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా మారింది.

Aadhar Mistake
అధికారుల నిర్లక్ష్యం...ఆధార్ లో మరణం... చదువుకు దూరం...

By

Published : Oct 5, 2021, 6:12 PM IST

అధికారుల నిర్లక్ష్యం...ఆధార్ లో మరణం... చదువుకు దూరం...

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన సాయిరాజ్ ఐటిఐ రెండో సంవత్సరం చదువుతున్నాడు. విద్యాదీవెన కోసం ఆధార్ కార్డు అప్​డేట్​ చేయాలని అతనికి కళాశాల అధ్యాపకులు తెలిపారు. దీంతో గత ఫిబ్రవరిలో దరఖాస్తు చేశాడు. అయితే కొద్ది రోజుల తర్వాత.. సాయిరాజ్ చరవాణికి " మీరు నమోదు చేసిన ఆధార్ నెంబరు గల సభ్యులు మరణించారని..వారి కుటుంబ సభ్యులు ధ్రువీకరించినందున దరఖాస్తు స్వీకరించబడదు" అని సందేశం వచ్చింది. రేషన్ కార్డులో కూడా అతని పేరు లేదు. దీంతో సాయిరాజ్, అతని తండ్రి శ్రీనివాసులు అవాక్కైయ్యారు.

అప్పటినుంచి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. కానీ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు. అధికారులు బతికుండగానే చనిపోయినట్లుగా ధ్రువీకరించడంతో విద్యాదీవెనతో పాటు రేషన్, ఇతర ప్రభుత్వ పథకాలు కూడా అందడంలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బతుకు బండిని నడిపేందుకు మగ్గం నేస్తూ.. ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తూ జీవిస్తున్నామని సాయిరాజ్​ తెలిపాడు.

తన భార్య చనిపోయి మూడు నెలలు అయిందని...ఆ బాధలో ఉన్న తనకు బతికి ఉన్న కుమారుడు చనిపోయినట్లు అధికారులు చూపడంతో మరింత మనోవేదనకు గురవుతున్నాని శ్రీనివాసులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తప్పును సరిదిద్దాలని సాయిరాజ్, తండ్రి శ్రీనివాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : Nara Lokesh: పరిహారం ఇవ్వకుండా భూమి లాక్కోవడమేంటి..?: నారా లోకేశ్

ABOUT THE AUTHOR

...view details