ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహేతర సంబంధమే హత్యకు కారణం: డీఎస్పీ రమ్య - పిల్లలపల్లి అటవీ ప్రాంతంలో మహిళ హత్య

అనంతపురం జిల్లాలోని పిల్లలమర్రి అటవీ ప్రాంతంలో గత వారం జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు చెప్పారు.

dsp
వివాహేతర సంబంధమే హత్యకు కారణం: డీఎస్పీ రమ్య

By

Published : Jan 17, 2021, 4:31 PM IST

గత వారం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి అటవీ ప్రాంతంలో చాందిని అనే మహిళ హత్యకు గురైన ఘటనలో గంగాధర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రమ్య తెలిపారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అన్నారు. సెట్టూరు మండలం మంగంపల్లి గ్రామానికి చెందిన చాందినితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న అదే గ్రామానికి చెందిన గంగాధర్ ఆమెతో గొడవపడ్డాడు. ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు డీఎస్పీ రమ్య వివరించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు పంపినట్లు చెప్పారు. మృతురాలి చరవాణి స్వాధీనం చేసుకున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details