అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో 198 మంది పారిశుద్ధ్య కార్మికులకు డీఎస్పీ శ్రీనివాసులు మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. వీటితోపాటు సీఐటీయు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు సబ్బులు, కొబ్బరి నూనె అందజేశారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు డీఎస్పీ అవగాహన కల్పించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికులు అందిస్తున్న సేవలను డీఎస్పీ కొనియాడారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడిన డీఎస్పీ - అనంతపురం జిల్లా వార్తలు
కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు కొనియాడారు. వారికి ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
dsp distributed masks and sanitizers to Sanitation workers