అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములను కోల్పోయిన తమను ఆదుకోవాలంటూ... బాధితులు ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. పరిహారం అందిస్తామని పాలకులు హామీ ఇచ్చినప్పటికీ... నేటికీ కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మమ్మల్ని ఆదుకోండి: బుక్కపట్నం రిజర్వాయర్ బాధితులు
అనంతపురం జిల్లాలోనే పెద్దదైన బుక్కపట్నం చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. ఈ ప్రాజెక్టు ముంపు బాధితులు తమను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి వినతి పత్రం అందించిన బుక్కపట్నం రిజర్వాయర్ బాధితులు