ఫిబ్రవరి 29 నుంచి మార్చి1 వరకు నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా పాలనాధికారి గంధం చంద్రుడు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నిధులను విడుదల చేసిందన్నారు. ప్రధాన వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికల స్థలాలను పరిశీలించారు. ఆలయానికి పర్యాటకులను పెంచడమే లక్ష్యంగా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గంధం చంద్రుడు తెలిపారు.
లేపాక్షి ఉత్సవాలపై అనంతపురం కలెక్టర్ సమావేశం
లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్లపై అనంతపురం జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రధాన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
లేపాక్షి ఉత్సవాలపై జిల్లా కలెక్టర్ సమావేశం