'కదిరి ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ '
అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పర్యటించారు. ప్రాంతీయ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. పల్లె నిద్రలో భాగంగా కాళసముద్రం గురుకుల పాఠశాలలో బసచేశారు.
అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలను కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగంతో పాటు వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పల్లె నిద్రలో కలెక్టర్ .. కాళసముద్రం గురుకుల పాఠశాలలో నిద్రించారు. అంతకముందు కదిరి పట్టణం లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, ఎస్సీ కళాశాల వసతి గృహాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. భోజనం, ఇతర వసతులపై ఆరా తీశారు. విద్యతోనే గౌరవం లభిస్తుందని ప్రతి విద్యార్థి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.