ప్రభుత్వం ఇసుక తరలింపుపై నిషేధం విధించడం వల్ల వేలాదిమంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారంటూ మడకశిరలోని ప్రధాన రహదారిపై భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. తహశీల్దార్ వచ్చి ఇసుక తరలించుకోవడానికి అనుమతి ఇచ్చే వరకూ వెళ్లేది లేదని పట్టుపట్టి కుర్చున్నారు. గత కొన్ని రోజులుగా ఇసుక లేకపోవడంతో ప్రభుత్వ భవనాలు, సామాన్యులు ఇళ్లు నిలిచిపోయాయని దాదాపు పది వేల మంది కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర తహశీల్దార్ హరినాథ్ రావు వచ్చి ఇసుక తరలింపుపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలియజేయడంతో ధర్నా విరమించారు.
అనంతపురంలో ఇసుక కోసం ధర్నా - భవన నిర్మాణ కార్మికుల
ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వాలంటూ అనంతపురం జిల్లా మడకశిరలో భవన నిర్మాణ కార్మికులు భారీ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రోడ్డుపై బైఠాయించి ధర్నాచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు