ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యాప్ రుణాలను కట్టడి చేయటానికి ప్రణాళిక రచిస్తున్నాం: డీజీపీ

యాప్ రుణాలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని డీజీపీ రాజేంద్రనాథరెడ్డి అన్నారు. పోలీసులకు సైబర్ నేరాలను అడ్డుకునే శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

డీజీపీ
డీజీపీ

By

Published : Jul 31, 2022, 4:43 AM IST

యాప్ రుణాలను కట్టడి చేయటానికి ప్రణాళిక చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథరెడ్డి చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల పర్యటనకు వచ్చిన డీజీపీ అనంత నగరంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి, అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలో పోలీసు నియామకాలు చేస్తామన్నారు. వారాంతపు సెలవుల విషయంలో పదవీవిరమణలు ఎక్కువుగా ఉన్నందున పనిచేస్తున్న వారిపై కొంత పనిభారం ఉంటుందన్నారు. యాప్ రుణాలపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని, పోలీసులకు సైబర్ నేరాలను అడ్డుకునే శిక్షణ ఇస్తున్నట్లు డీజీపీ చెప్పారు.

రహదారులపై ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా వివిధ శాఖలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. రౌడీషీటర్ తెరిచే విషయమై కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే అలాంటి ఆదేశాలు ఇచ్చామన్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నేరాలను అదుపుచేయటానికి తీసుకోవల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details