ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారును ఢీకొట్టిన డీసీఎం.. అదుపు తప్పి బోల్తా - ananthapuram road accidents

వేగ నిరోధకాల వద్ద వెనక నుంచి కారును ఢీకొట్టి.. ప్రమాదవశాత్తు ఓ డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని దుద్దేబండ కూడలి వద్ద జరిగింది. రోడ్డుపై డీసీఎం బోల్తా పడటంతో కొంతమేర ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతినగా.. ఎవరికీ అపాయం జరగలేదు.

dcm hits the car
కారును ఢీకొట్టిన డీసీఎం

By

Published : Mar 4, 2021, 12:29 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని దుద్దేబండ కూడలి వద్ద పెను ప్రమాదం తప్పింది. 44వ జాతీయ రహదారిపై వేగ నిరోధకాల వద్ద ముందు వెళుతున్న కారును వెనకనుంచి డీసీఎం వాహనం ఢీకొని ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదు. మంగళవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో మైసూరు నుంచి హైదరాబాద్​కు కొబ్బరి బొండాల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది.

రోడ్డుపై డీసీఎం బోల్తా పడటంతో కొంతమేర ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్సై సతీష్ కుమార్ సిబ్బందితో కలసి ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న ధర్మవరం వాసులకు ఎలాంటి అపాయం లేదు. కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details