అనంతపురంజిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే చెల్లించాలని, సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ... నిన్న నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన కనీసం ఎమ్మెల్యేలు పరామర్శించడానికి కూడా వెళ్ళని దుస్థితి నెలకొందని, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఆగ్రహంవ్యక్తం చేశారు. కరవు పరిస్థితుల్లో నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని అంతేగాక..ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భరోసా పర్యటనను చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాల్లో అన్ని మండలాల్లో ఇవాళ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.
వేరుశెనగ రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి...సీపీఐ
అనంతపురం జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
cpi leaders protests mro office at ananthapur district