అనంతపురం జిల్లా తాడిమర్రి గ్రామానికి చెందిన రైతు వీర నారప్ప 2011లో కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లిలో రూ.40 వేలు వెచ్చించి ఆవు కొనుగోలు చేశాడు. ఎనిమిదేళ్లపాటు నిరంతరాయంగా రోజు 10 లీటర్ల పాలు ఇచ్చింది. ఏ ఏడాది నుంచి రోజూ ఉదయం పూట 3 లీటర్ల పాలు ఇస్తున్నట్లు రైతు వీర నారప్ప చెప్పాడు. ఆవు దూడ ను రూ.45 వేలకు విక్రయించాడు. ఏళ్ల తరబడి పాలు ఇస్తున్న ఆవును చూసేందుకు భారీగా వస్తున్నారు. ఆవు రక్తంలో ఆక్సిటోసిన్ హార్మోన్ల ప్రభావం అధికంగా ఉంటే ఏళ్ల తరబడి పాలు ఇస్తూ ఉంటుందని.. పశు సంవర్థక శాఖ ఏడీ శ్రీనివాసులు చెబుతున్నారు.
తొమ్మిదేళ్లుగా ఏకధాటిగా పాలు ఇస్తున్న ఆవు! - అనంతపురంలో తొమ్మిదేళ్లుగా పాలిస్తున్న ఆవు వార్తలు
పాడి ఆవు ఎక్కడైనా.. ఏడాదిపాటు పాలు ఇవ్వడం చూశాం. కానీ ఓ ఆవు మాత్రం తొమ్మిదేళ్లుగా పాలు ఇస్తూనే ఉంది. ప్రతిరోజు 3 లీటర్ల పాలు ఇస్తుంది.
తొమ్మిదేళ్లుగా ఏకధాటిగా పాలు ఇస్తున్న ఆవు!