నిర్లక్ష్యం: పీపీ కిట్లు ధరించకుండా కరోనా పరీక్షలు - corona tests in Anantapur district
కరోనా జాగ్రత్తల గురించి ప్రజలకు చెప్పాల్సిన వైద్య సిబ్బందే వాటిని పాటించకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో జరిగింది. సచివాలయ వైద్యసిబ్బంది పీపీ కిట్లు ధరించకుండా కరోనా పరీక్షలు నిర్వహించటంపై కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
నిర్లక్ష్యం: పీపీ కిట్లు ధరించకుండా కరోనా పరీక్షలు
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని పాత ఎస్సీ కాలనీలోని వార్డు సచివాలయ వైద్య సిబ్బంది పీపీ కిట్లు ధరించకుండా పరీక్ష నిర్వహించారు. దీన్ని చూసి కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇలా చేయటంతో ఎవరి నుంచి ఎవరికి కోవిడ్ సోకి ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
చామాలగొందిలో చెరువుకు కోత..మరమ్మతులు చేపట్టిన అధికారులు