పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం ఘోష ఆసుపత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. కరోనా కాలంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ ఆసుపత్రి ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరోనా బారిన మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. లేని పక్షంలో జీజీహెచ్, మండల కేంద్రాల్లో ఈనెల 28న సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వైద్యసిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.
పాడేరులో పొరుగు సేవల వైద్య సిబ్బంది ఆందోళనల బాట పట్టారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తోన్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. తమ డిమాండ్లను ఈనెల 28లోగా తీర్చాలని లేనట్లయితే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లాలో..