కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రద్దు కోసమే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
'ముఖ్యమంత్రి జగన్ రైతుల వ్యతిరేకిగా మారారు' - shilajanath comments on jagan
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు పూర్తి వ్యతిరేకమని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రైతుల వ్యతిరేకిగా మారారని శైలజానాథ్ ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి సంతకాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టి తమ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ రైతుల వ్యతిరేకిగా మారారని శైలజానాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు తీసుకొస్తే.. జగన్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, వెంటనే మీటర్ల బిగించే పని మానుకోకపోతే ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి సంతకాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టి తమ నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ... రైతులు టీషర్ట్లు, సెల్ఫోన్లు వాడకూడదా..?: నారా లోకేశ్