కృష్ణా జిల్లా..
క్రిస్మస్ పర్వదిన వేడుకలు జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పలు చర్చిల్లో ఘనంగా జరిగాయి. భక్తులంతా చర్చిల్లో ప్రార్థనలు చేశారు. బాలయేసు రాకను ఆహ్వానిస్తూ... ఆర్సీఎం, సీఎస్ఐ, పెంతెకోస్తు, పెనుగంచిపోలులోనే షాలోమ్, జెజీఎం చర్చిలో ప్రార్థనలు చేశారు.
అనంతపురం జిల్లా..
జిల్లాలోని తాడిపత్రి పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. చర్చి ప్రాంగణంలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. మతపెద్దలు ప్రార్థనలు చేశారు. సప్తగిరి సర్కిల్ ప్రధాన సీఎస్ఐ చర్చిలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తులకు, పాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాజంలో బైబిల్, ఖురాన్, భగవద్గీత మూడు తెలిపేవి ఒక్కటే అని... మనుషులను ప్రేమించాలని అప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని చెప్పారు.
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 58 దేశాలకు చెందిన వేలాది మంది భక్తుల నడుమ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సాయికుల్వంత్ మందిరంలో క్రిస్మస్ వేడుకలను అంతర్జాతీయ క్రిస్మస్ కోఆర్డినేటర్ టామ్ ప్.జాన్ హనర్, క్యాండీల్స్ వెలిగించి ప్రారంభించారు. సాయి విద్యార్థులు, విదేశీ భక్తులు సంయుక్తంగా గీతాలను ఆలపించారు. విద్యుత్ కాంతులతో ప్రశాంతి నిలయం నూతనశోభను సంతరించుకుంది.