అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉటకల్లు కొండల్లో రెండు చిరుతల సంచరిస్తున్నాయని, ప్రచారం జరుగుతోంది. గొర్రెల మందలపై చిరుతలు వరుసగా దాడులు చేసి గొర్రెలను ఎత్తుకెళ్తున్నాయని గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత అడుగులను చూసి గుర్తుపట్టి భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణంలోనైనా చిరుత జనావాసం లోకి వస్తే ప్రజల పరిస్థితి ఏంటని పొలాల్లో పనిచేస్తున్న రైతులపై ఎప్పుడూ ఎలా దాడి చేస్తుందోనని గ్రామ ప్రజలు భయపడుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఇక్కడ నుంచి చిరుత పులులను తరలించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
చిరుత సంచారం.. గ్రామస్థుల భయం.. భయం - sheeps
అనంతపురం జిల్లా ఊటకల్లు కొండల్లో చిరుత సంచారం ఉందని.. గొర్రెలు, మేక పిల్లల పై వరుసగా దాడులు చేస్తోందని గ్రామస్థులు భయందోళన చెందుతున్నారు.
చిరుత