అనంతపురం జిల్లా తనకల్లు మండలం కోటూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కోటూరుకు చెందిన శివరామిరెడ్డి బైక్పై పొలానికి వెళుతుండగా.. కదిరి నుంచి మదనపల్లి వెళ్తోన్న ఇన్నోవా వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు మృతి - అనంతపురం కోటూరులో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనంపై పొలం వెళ్తుండగా కారు ఢీకొని రైతు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కోటూరులో జరిగింది.
కోటూరులో రోడ్డు ప్రమాదం