అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం చెరువు సమీపంలో కాలువకు గండి పడింది.కోతకు గురై వందలాది ఏకరాల పంటలు దెబ్బతిన్నాయి.లక్షలాది పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హూటాహుటిన స్పందించిన అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి జేసీబీతో మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు.వీలైనంత త్వరగా గండిని పుడుస్తామని అధికార్లు తెలిపారు.అధికార్లు ముందస్తుగా కాలువ గట్లను పరిశీలించకపోవటం వల్లనే తమ పంటలు దెబ్బతిన్నాయని, పదేళ్ల తరువాత నిండిన చెరువులో నీరు వృధాగా బయటకు పోతోందని రైతులు విచారం వ్యక్తం చేశారు.
గుంతకల్లులో చెరువుకు గండి..నీట మునిగిన పంటలు - Bury canals farmer
ఎడతెరిపి లేని వర్షాలతో అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో కాలువకు గండిపడింది. అధికార్ల ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్లే, తమ పంటలు నీట మునిగడంతో పాటు, భారీగా నీరు వృధా అవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలువల గండ్లు పూడ్చండి..రైతులు