కుల, మత, అవినీతిరహితపాలన సాగిస్తున్న మోదీ... రాష్ట్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నారని తెలిపారు అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ. తమ పాలనపై అసత్య ఆరోపణలు చేసిన నాయకులు సైతం నేడు కాషాయ కండువాలు కప్పుకొంటున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ సుపరిపాలనకు నిదర్శనమన్నారు. ఇలాంటి సయమంలో ప్రత్యేకహోదా అంటూ ప్రజల్ని మభ్యపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అప్పట్లో విభజన తప్పదని తెలిసి ప్రజలను తప్పుదారి పట్టించారని.... ఇప్పుడూ అదే దారిలో వెళ్తున్నారని ఆరోపించారు. అందుకే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలిందని... వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
2024 ఎన్నికల్లో గెలిచేది మేమే: కన్నా లక్ష్మీనారాయణ
సమైక్యాంధ్ర, ప్రత్యేకహోదా అంటూ ప్రజలను రాజకీయ పార్టీలు మభ్యపెడుతున్నాయని భాజపా రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. మోదీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని... 2024లో ఇక్కడ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న కన్నా లక్ష్మీనాారాయణ