BJP MP Laxman comments on CM Jagan: సీఎం జగన్‌కి సంక్షేమానికి, ఉచితాలకు తేడా తెలియక.. ఆంధ్రప్రదేశ్ సంపదను విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో.. బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌తో సహా ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంక్షేమానికి, ఉచితాలకు తేడా తెలియకుండా పోవటంతో ఆంధ్రప్రదేశ్ సంపదను విచ్చిలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో సేవాలాల్ జయంతి ఉత్సవాల కోసం వచ్చిన లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా సంపదను దోచుకుంటున్నారని, ఇసుక, ల్యాండ్ మాఫియాలు పెచ్చుమీరిపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రాన్ని ఎనిమిది కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిన జగన్ మోహన్ రెడ్డి తీరుతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పారు.
బీజేపీ అధికార ప్రతినిధి లంక దినకర్ మాట్లాడుతూ నిన్నటివరకు మూడు రాజధానుల గురించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విశాఖ మాత్రమే రాజధానిగా చెబుతోందని విమర్శించారు. రాజధాని విషయంలో పలు విధాలుగా ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రుషికొండను కాజేశారని, రాయలసీమ దోచేశారంటూ దినకర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ప్రజలమధ్య చిచ్చుపెట్టే ధోరణిని మనుకోవాలని హెచ్చరించారు.
జగన్ ఆంధ్రప్రదేశ్ సంపదను విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టుగా నిధులు కేంద్రానివి.. ప్రచారం జగనన్నది. పథకాలు కేంద్రానివైతే పథకాల పేర్లు మార్చి జగన్ సొంత డబ్బా కొట్టుకుని.. అనతి కాలంలోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఎనిమిది లక్షల కోట్ల అప్పులతో నేడు ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారింది. సీఎం మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడ జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. అందుకే ప్రభుద్యోగుల నుంచి వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం అధికారులు అభివృద్ధిని పక్కన పెట్టి ఇష్టానుసారంగా సంపదను దోచుకుంటున్నారు.. ఇసుక, ల్యాండ్ మాఫియాలకు రాష్ట్రం పెట్టింది పేరు.- లక్ష్మణ్, భాజపా ఎంపీ, ఈబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు
ఇవీ చదవండి: