అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని అర్బన్ కాలనీ వద్ద వింత పక్షిని చూసి.. అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అడవిలో ఉండే కొమ్ము పక్షిగా గుర్తించారు. అది పడిపోయి ఉన్న కారణంగా.... బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని పక్షిని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.
వింత పక్షి కలకలం.. బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని అనుమానం! - అనంతపురంలోకి వింత పక్షి రాక
అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఓ వింత పక్షి.. స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ఆ పక్షి తీరు చూసి.. బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని అక్కడి ప్రజలు అనుమానిస్తున్నారు.
గ్రామంలోకి వింత పక్షి రాక..