అనంతపురం జిల్లా నుంచి వలస కూలీలను శ్రామిక్ రైలులో బీహార్ తరలించారు. సూమారు 1500 మంది కూలీలు స్వరాష్ట్రాలకు బయల్దేరారు. వారికి టిక్కెట్లతో పాటు తాగునీరు, భోజనం, శానిటైజర్లు అందజేసి రైలు ఎక్కించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా రాజస్థానీలు, గుజరాతీలను వారి స్వంత రాష్ట్రానికి పంపటానికి.. అధికారులు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. పెద్దఎత్తున స్పందన వస్తోందన్నారు.