ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలుగుబంటి దాడి.. ఉపాధి హామీ కూలీకి గాయాలు - ఎలుగుబంటి దాడి.. ఉపాధి హామీ కూలికి గాయాలు..

అనంతపురం జిల్లా పెనుకొండ పరిధిలో.. ఉపాధి హామీ కూలీలపై ఎలుగుబంటి దాడి చేసింది. ఒక యువకుడు గాయపడ్డాడు.

ananthapuram district
ఎలుగుబంటి దాడి... ఉపాధి హామీ కూలికి గాయాలు..

By

Published : May 2, 2020, 5:42 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామ సమీపంలోని గొర్లకనంలో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. మోటువారిపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు గాయపడ్డాడు. వెంటనే పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details