ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థులపై దాడికి నిరసనగా అనంతపురంలో బంద్​

అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా విద్యార్థి సంఘాలు రేపు జిల్లాలో బంద్​కు పిలుపు నిచ్చాయి. ​

బంద్
బంద్

By

Published : Nov 8, 2021, 10:32 PM IST

విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో బంద్​కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. బంద్​ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి లోకేష్​ పర్యటన ఉండనుంది.

అనంతపురం జిల్లాలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని భాజపా నేత సత్యకుమార్​ ఖండించారు. ట్విట్టర్​లో ఆయన విద్యార్థులపై దాడిపై సీఎం జగన్​ను ప్రశ్నించారు.

భాజపా నేత వై సత్యకుమార్​ ఖండన

"కోడి పందెం వేసేందుకు మీ ఎమ్మెల్యేలు ముందుంటారు … దౌర్జన్యం చేసేందుకు అనధికార కార్యకర్త పోలీసులు ముందుంటారు … అవినీతి చేసేందుకు మీ వందిమాగధులు ముందుంటారు … అవినీతి అరాచక పునాదుల మీద మీ పార్టీ పుట్టిందనేందుకు ఇంతకు మించి సాక్ష్యం ఏం కావాలి జగన్​ గారు?"

-వై సత్యకుమార్, భాజపా నేత

ఇదీ చదవండి:అనంతపురంలో ఎస్‌ఎస్‌బీఎన్‌ ఎయిడెడ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత .. పోలీసుల లాఠీచార్జీ

ABOUT THE AUTHOR

...view details