పేదలకు పంపిణీ చేస్తున్న 31 లక్షలు ఇళ్లు ఎక్కడ ఇస్తున్నారో మంత్రి బొత్స సమాధానం చెప్పాలని తెదేపా సినీయర్ నేత బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.
"ఏ భూములు ఇస్తున్నారో మంత్రి బొత్స తెలపాలి. ఆ స్థలాలు కోసం తవ్విన మట్టి ఎక్కడికి పంపారో చెప్పాలి. పట్టా భూముల్లో చదును చేసి రోడ్లు వేశారు. వాటికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలి. న్యాయస్థానాల్లో ఉన్న భూములను భూ సమీకరణ కింద ఏ విధంగా సమీకరించారు. దాని కోసం ఎన్ ఏ యాక్ట్ అనుసరించారా?."-బండారు సత్యనారాయణ
ఇళ్ల పట్టాల కార్యక్రమానికి 7 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని ఆ అంశంపై, ఆ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు. తాను మాట్లాడింది తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండారు స్పష్టం చేశారు.