ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం ఎస్పీగా ఏసుబాబు బాధ్యతల స్వీకరణ

జిల్లాలో నేరాలను తగ్గించి శాంతి భద్రతలను కాపాడడమే తన మొదటి ప్రాధాన్యమనీ అనంతపురం జిల్లా ఎస్పీ ఏసుబాబు అన్నారు. జిల్లా నూతన ఎస్పీగా నేడు బాధ్యతలు స్వీకరించారు.

అనంతపురం ఎస్పీగా ఏసుబాబు బాధ్యతల స్వీకరణ

By

Published : Jun 9, 2019, 2:46 PM IST

అనంతపురం జిల్లా ఎస్పీగా నియమితులైన ఏసుబాబు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సిబ్బంది ఆయనకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. 2011 బ్యాచ్​కు చెందిన ఏసుబాబు గతంలో ప్రకాశం జిల్లాలో గ్రేహౌండ్స్​లో గ్రూప్ కమాండర్​గా పనిచేశారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడడమే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. నేరాలను తగ్గించడంపై దృష్టి పెడతామనీ.. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అనంతపురం ఎస్పీగా ఏసుబాబు బాధ్యతల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details