ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CHATBOT పోగొట్టుకున్న ఫోన్‌ను వెతికిపెట్టే చాట్‌ బాట్‌ - ANANTAPUR POLICE CHATBOT

CHATBOT APP సెల్​ఫోన్​ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి జీవితాలలో భాగమైన వస్తువు. అలాంటి ఫోన్​ చేజారిపోతే దానిని తిరిగి తెచ్చుకోవడం ఎంత ప్రయాసతో కూడిన పనో అందరికీ తెలిసిందే. మనకు తెలిసిన అన్ని మార్గాల్లో దానికోసం వెతకడం మొదలుపెడతాం. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన దానిని తిరిగి పొందలేము. అటువంటి వారి కోసమే అనంతపురం పోలీసులు చాట్‌ బాట్‌ పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు.

CHATBOT
CHATBOT

By

Published : Aug 26, 2022, 9:49 AM IST

CHATBOT సెల్‌ఫోన్‌ పోతే తిరిగి దక్కించుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను వెతికిపెట్టేందుకు అనంతపురం జిల్లా పోలీసులు ‘చాట్‌ బాట్‌’ పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నవారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లక్కర్లేకుండా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన పని లేకుండా వాట్సప్‌ మెసేజ్‌ చేస్తే చాలు.. పోగొట్టుకున్న ఫోన్‌ను రికవరీ చేసి, బాధితులకు అందజేస్తున్నారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ‘చాట్ బాట్‌’ సాంకేతికతను జూన్‌ 27న అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఎలా పని చేస్తుందంటే..
* సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న/ చోరీకి గురైనవారు ముందుగా 94407 96812 నంబర్‌ వాట్సప్‌కు ఆంగ్లంలో ‘హాయ్‌’ లేదా ‘హెల్ప్‌’ అని మెసేజ్‌ పంపాలి.

* వెంటనే ‘వెల్‌కమ్‌ టు అనంతపురం పోలీస్‌’ పేరున లింకు వస్తుంది. అందులో గూగుల్‌ ఫార్మాట్‌ ఓపెన్‌ అవుతుంది. దానిలో జిల్లా, పేరు, వయసు, తండ్రి పేరు, చిరునామా, కాంటాక్ట్‌ నంబర్‌, పోయిన ఫోన్‌ మోడల్‌, ఐఎంఈఐ నంబర్‌, మిస్సయిన ప్రాంతం తదితర వివరాలను నమోదు చేయాలి.

* వివరాలు నమోదు చేయగానే ఫిర్యాదు వెళ్తుంది. దీనిని పర్యవేక్షించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో 8 మందితో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోంది.

* చాట్‌ బాట్‌ ద్వారా ఫోన్ల ఆచూకీ లభిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచీ ఫిర్యాదులు వస్తున్నాయి.

* ఈ ఏడాది ఆగస్టు 24 నాటికి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 7,603, ఇతర జిల్లాల నుంచి 2,856, ఇతర రాష్ట్రాల నుంచి 202 మంది చాట్‌బాట్‌కు వివరాలు పంపారు. ఇప్పటి వరకు 10,661 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో 2,100 ఫోన్ల ఆచూకీ కనుక్కొని బాధితులకు అందజేశారు. 2,950 ఫోన్ల వివరాలు తెలిశాయి.

* కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌’ ఈ సేవలను గుర్తించి ‘టెక్నాలజీ సభ 2022’ అవార్డుకు ఎంపిక చేసింది.

సంతోషంగా ఉంది: ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ, అనంతపురం
చాట్‌బాట్‌ ద్వారా రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఫోన్లను రికవరీ చేశాం. మా సాంకేతిక బృందం, ఇతర అధికారుల కృషి ఫలించి ‘టెక్నాలజీ సభ’ అవార్డుకు ఎంపికవడం సంతోషంగా ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details