పార్క్ చేసిన బైకులను సులువుగా దొంగతనం చేసే ఓ బాలుడిని అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరచనున్నారు. ఇతని నుంచి రూ. 3.5 లక్షల విలువ చేసే 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నాల్గవ పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఈ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి 21 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. అనంతరం బెయిల్పై బయటకు వచ్చి తిరిగి దొంగతనాలను ప్రారంభించాడు. జిల్లాలో జరుగుతున్న వరుస వాహనాల చోరీతో.. అప్రమత్తం అయిన ఎస్పీ సత్య ఏసుబాబు.. నిందితులను వేగంగా పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ క్రమంలో ప్రత్యేక బృందంగా ఏర్పడిన పోలీసులు ముందస్తు సమాచారంతో నిందితుడిని పట్టుకున్నారు. చిన్న వయసులోనే మద్యానికి బానిసైన అతడు సులువుగా డబ్బు సంపాదించాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ద్విచ్రవాహనాల చోరీల్లో ఆరితేరిన మైనర్...
నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను అలవోకగా చోరీ చేస్తున్నాడు ఓ మైనర్. వయసుకు మించి చేసిన దొంగతనాలు అందరిని షాక్కు గురి చేస్తున్నాయి. తొలుత 21 బైక్లను చోరీ చేసి పట్టుబడిన ఆ బాలుడు బెయిల్పై బయటకు వచ్చి మరో 8 వాహనాలను ఎత్తుకెళ్లాడు.
మైనర్ దొంగ