ప్రైవేట్ పాఠశాలలకూ అమ్మఒడి కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రభుత్వ బడుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనిబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు అభిప్రాయ పడ్డారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు అమ్మఒడి కార్యక్రమం అమలు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ తగ్గుతుందని చెప్పారు.ఫలితంగా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనారిటీ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే వారికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
'అమ్మఒడి' ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తింపచేయాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు.
'అమ్మఒడి' ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే కల్పించాలి