అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఎస్వీ మినీ థియేటర్ సమీపంలో రవి కుమార్ (36) అనే గార్మెంట్స్ కార్మికుడు మరణించాడు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం...కనేకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే వాడు, తాగుడుకు బానిసై విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారనీ అప్పటి నుంచి గత 5ఏళ్లుగా రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమల్లో జీవనోపాధి పొందేవాడని తెలిపారు. ఇతని మరణంతో బాధితకుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మృతుడి ఒంటిపైన తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరైనా కొట్టి చంపారా? లేక మద్యం మత్తులో మరణించాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అనంతపురం జిల్లాలో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
చనిపోయిన వ్యక్తి