అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువు ముందర తండావాసులు తాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. నీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 15 రోజుల కిందట గ్రామంలోని ట్యాంక్ మరమ్మతుకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. తిరిగి పునరుద్ధరించి సమస్య పరిష్కరించాలని మండల స్థాయి అధికారుల వరకు వినతి పత్రాలు అందజేసినట్టు పేర్కొన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని లేకుంటే ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని చెరువు ముందర తండావాసులు హెచ్చరించారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలని బిందెలతో ఆందోళన
తాగునీటి సమస్య పరిష్కరించాలని జనం రోడ్డుపైకి వచ్చారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా... పట్టించుకున్న పాపాన పోలేదని... అనంతపురం జిల్లాలోని ఓ మారుమూల తండా ప్రజలు నిరసన బాట పట్టారు.
తాగునీటి సమస్య పరిష్కరిం ఆందోళన