కామంతో మృగంలా మారిన ఓ వృద్ధుడు సొంత మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. హిందూపురం రూరల్ పోలీసు స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మహబూబ్ బాషా మీడియాకు వెల్లడించారు.
పరిగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధుడు(55) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తొమ్మిదేళ్ల మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు... వెంటనే చిన్నారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వృద్ధుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.