మడకశిర పట్టణంలో డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన స్వగ్రామం నీలకంఠాపురంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
హిందూపురంలో భాజపా యువసేన, తెదేపా నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైకాపా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నవీన్ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అనుచరులు.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ చిత్ర పటానికి క్రేన్‌తో పూలమాల వేసి అంజలి ఘటించారు. రాజ్యాంగ నిర్మాత సేవలను గుర్తు చేసుకున్నారు.
రాయదుర్గం పురపాలికలో మున్సిపల్ చైర్ పర్సన్ పోరాళ్ళు శిల్ప, కమిషనర్ జబ్బర్ నియా, ఇతర మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, కౌన్సిలర్లు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ మహనీయుని ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు.