ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో నాలుగు హత్యా కుట్రలను భగ్నం చేసిన పోలిసులు - accused arrested by police

వేరు వేరు ఘటనల్లో నలుగురిని హత్యచేసేందుకు కుట్ర పన్నిన 9 మంది నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు అనంతపురం పోలిసులు.

accused arrested by police at ananthpuram district because of they triying to kill the four men.

By

Published : Aug 16, 2019, 7:59 PM IST

కుట్ర భగ్నమైంది.. అరెస్ట్ కి దారితీసింది.

వేరు వేరు సందర్భాల్లో నలుగురిని హత్య చేసేందుకు పన్నిన కుట్రలను పోలిసులు భగ్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. తమ ప్రత్యర్దులను అంతమొందించేందుకు పన్నిన ఈ కుట్రలను పక్కా సమాచారంతోనే భగ్నం చేసినట్లు జిల్లా ఎస్పీ సత్యా ఏసుబాబు వెల్లడించారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. జిల్లాలో బత్తులపల్లి రూరల్, తాడిపత్రి రూరల్ , కళ్యాణదుర్గం రూరల్ పరిసర ప్రాంతాల్లో హత్యలకు నిందితులు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. వీరి కుట్రలపై కన్నేసిన పోలిసులను అదను చూసి వారిని అరెస్ట్ చేశారు. మొత్తం 9 సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 6 వేటకొడవేళ్లు,15 డిటోనేటర్లు, 15 జిలెటీస్ స్టిక్స్, 400 గ్రాముల బాంబుల తయారీ పౌడర్, 3 ఇనుప పైపులు, ఒక మారుతి వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలిసులు తెలిపారు. వీరిలో కొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. వీరి కుట్రలను భగ్నం చేసి చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. శాంతిభద్రలను ఇబ్బంది కలిగేలా ఎవరైనా ప్రయత్నిస్తే,ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details