ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accidents: జిల్లాలో 2 ప్రమాదాలు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - batrepally latest news

లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో... ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో చోట లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో విద్యుత్ స్తంభం దాదాపుగా నేలకొరిగి ప్రమాదకరంగా మారింది. ఈ రెండు ప్రమాదాలు అనంతపురం జిల్లాలో జరిగాయి.

accident
accident

By

Published : Jul 1, 2021, 10:28 AM IST

తలుపుల మండలం బట్రేపల్లి వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కదిరి - పులివెందుల ప్రధాన రహదారిపై బట్రేపల్లిక్రాస్​లో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో కదిరి పట్టణానికి చెందిన సద్దాం అక్కడికక్కడే మృతి చెందారు. కదిరికి చెందిన సద్దాం, లాలూ, రఫీ.. పులివెందుల నుంచి కదిరి వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన లాలూ, రఫీని చికిత్స కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ప్రమాదం...

కదిరిలోని రెవెన్యూ కాలనీలో విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొనడంతో స్తంభం దాదాపు నేలకొరిగి ప్రమాదకరంగా మారింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ స్తంభాన్ని సరిచేయాలని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

ఉద్యోగాల క్యాలెండర్ కోసం.. సెల్ టవర్ ఎక్కిన విద్యార్థి సంఘం నాయకుడు

ABOUT THE AUTHOR

...view details