అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. పెనుకొండకు చెందిన మారుతి అనే యువకుడు రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొంది.
అతను అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.