ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి - అనంతపురం జిల్లా తాజా వార్తలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. సుమారు 40 గొర్రెలు మృతి చెెందాయి. గొర్రెల మృతిలో 3 లక్షల రూపాయలు నష్టం వచ్చిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశాడు.

కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి
కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి

By

Published : Mar 18, 2021, 12:20 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలోని మహబూబ్​నగర్ కాలనీలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఉదయాన్నే నిద్రలేచిన గొర్రెల కాపరి... గొర్రెలను చూసి లబోదిబోమన్నాడు. జీవనోపాధి కోసం తనతో పాటు మరో ఇద్దరు మిత్రులతో కలిసి గొర్రెలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నాడు. తమ బంధువులుకు అనారోగ్యంతో ఉండటంతో చూడటానికి వెళ్ళామని... తిరిగి రావడం అర్థరాత్రి కావడంతో అలసిపోయి నిద్రపోయామని వెల్లడించాడు.

గొర్రెలకు ఎవరూ కాపలా లేకపోవడంతో కుక్కలు ఇలా దాడికి యత్నించాయని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, 3 లక్షల రూపాయల వరకు నష్టపోయామని అన్నాడు. వైద్యులు చనిపోయిన గొర్రెలను పరిశీలించాక.. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చేస్తామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details