medical courses in telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఆ క్రమంలోనే రాష్ట్రంలో తొలిసారిగా వైద్యవిద్య అనుబంధ కోర్సులను ప్రవేశపెట్టింది. 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 12 రకాల కోర్సులు, 860 బీఎస్సీ పారామెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..తొలిసారిగా వైద్యవిద్య అనుబంధ కోర్సులు - వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు
medical courses in telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 9 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 12 రకాల కోర్సులు, 860 బీఎస్సీ పారామెడికల్ సీట్లను అందుబాటులోకి రానున్నాయని తెలియజేస్తూ.. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
ఇప్పటికే తెలంగాణలో ఒకే ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల సీఎం కేసీఆర్... 8 నూతన వైద్య కళాశాలలను ఏకకాలంలో వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం వైద్య కళాశాలల్లో 2022-23 వైద్యవిద్య సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమైయ్యాయి. వీటి ద్వారా 1,150 సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో వైద్యవిద్య కళాశాలల సంఖ్య 17కి చేరింది.
ఇవీ చూడండి: