‘ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే బాధ్యత లేదా’ అని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం లింగాపురం గ్రామస్థులు నిలదీశారు.
పథకాలు అందుతున్నాయా? అని ఎమ్మెల్యే అడగగా.. రత్నం అనే మహిళ కంటతడి పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు అమ్మ ఒడి, చేయూత, పింఛను పథకాలకు అర్హత ఉన్నప్పటికీ.. ఏ ఒక్క పథకమూ అందలేదని చెప్పారు.