'దొంగే దొంగ అన్నట్టు వైకాపా తీరు'
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని పది మంది మంత్రుల బృందం కలిసింది. ఓట్లు తొలగించే కార్యక్రామన్ని ప్రతిపక్ష వైకాపా చేపట్టిందని.. గంపగుత్తగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించింది.
ప్రతిపక్ష వైకాపా వైఖరి దొంగే దొంగ అన్నట్టుందని మంత్రులు మండిపడ్డారు. రాష్ట్రంలోని ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని ఆ పార్టీ చేపట్టిందని ఆరోపించారు. వైకాపాపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన మంత్రులు...సాంకేతికత సాయంతో ఫారం 7తో దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ ముసుగు తీస్తే కేసీఆర్... కేసీఆర్ ముసుగు తీస్తే జగన్ కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపాను నేరుగా ఎదుర్కోలేక వైకాపా కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రతిపక్షంవ్యవహరిస్తోందని మండిపడ్డారు.